: అల్లర్ల అదుపునకు ‘పెప్పర్ బాల్’ టెక్నిక్


ఆందోళనలు, నిరసనలు తలెత్తినప్పుడు వాటిని అదుపు చేసేందుకు ఇప్పటి వరకూ రబ్బరు బుల్లెట్లను వినియోగించడం లేదా, ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ను ప్రయోగించడం తెలిసిందే. కానీ, ఇలాంటి అల్లర్ల అదుపునకు ఢిల్లీ పోలీసులు కొత్త టెక్నిక్ ను అమలు చేయనున్నారు. అదే, పెప్పర్ స్ప్రే. ఇప్పటికే అమెరికా, చైనా తదితర దేశాల్లో వినియోగిస్తున్న పెప్పర్ బాల్స్ ను ఢిల్లీలోనూ వినియోగించనున్నారు. పెప్పర్ బాల్స్ ను ప్రత్యేకంగా తయారు చేసిన గన్ ద్వారా వీటిని ప్రయోగించడం వల్ల ఆందోళనకారులను చెదరగొట్టవచ్చని పోలీసులు అంటున్నారు. పెప్పర్ బాల్ ప్రయోగం ప్రమాదకారి కాదని, గతంలో త్రిలోక్ పురిలో పెప్పర్ బాల్ ప్రయోగాన్ని చేయగా సత్ఫలితాలు వచ్చాయని, వీటి తయారీకి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించడం జరిగిందని ఢిల్లీకి చెందిన ఉన్నత పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా, ఏపీ విభజన బిల్లు సందర్భంగా పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే వినియోగించడంతో చాలా విమర్శలు ఎదురయ్యాయి.

  • Loading...

More Telugu News