: పోలీసులు వంద మందిని పిలిస్తే వెయ్యి మంది వెళ్లండి: కాపు నాయకులతో ముద్రగడ
పోలీసులు వంద మందిని పిలిస్తే, వెయ్యిమంది వెళ్లండంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం తమ నాయకులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఈరోజు ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. తమను స్టేషన్ కు రమ్మనమని చెప్పి పోలీసులు అదేపనిగా పిలస్తున్నారంటూ నాయకులు చెప్పడంతో ముద్రగడ పైవిధంగా సూచించారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా అధైర్యపడొద్దని కాపు నాయకులకు ఆయన భరోసా ఇచ్చారు.