: టీఎస్ అసెంబ్లీలో గందరగోళం... మంత్రి పోచారం పేపర్లను విసిరికొట్టిన జీవన్ రెడ్డి


గడచిన పది రోజులుగా, పూర్తి టీఆర్ఎస్ ఆధిపత్యంలో సాగుతున్నట్టు కనిపించిన తెలంగాణ అసెంబ్లీ, నేడు వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లి టేబుల్ పై ఉన్న పేపర్లను విసిరివేయగా, కాసేపు గందరగోళం నెలకొంది. కరవు పరిస్థితులపై సభలో చర్చ జరుగుతున్న వేళ ఈ ఘటన జరిగింది. కరవు మండలాల విషయంలో కేసీఆర్ ద్వంద్వవైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించగా, మంత్రి పోచారం అడ్డుకున్నారు. కాంగ్రెస్ సభ్యుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తిప్పికొట్టారు. ఈ సమయంలో జీవన్ రెడ్డి వేగంగా పోచారం వద్దకు వెళ్లి అన్నీ అబద్ధాలు చెబుతున్నారని అంటూ పేపర్లు విసిరేశారు. జీవన్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని కేటీఆర్ పట్టుబట్టగా, తాము వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించిన జానారెడ్డి కాంగ్రెస్ సభ్యులతో కలసి బయటకు వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News