: తెలంగాణ తీపికబురు... రూ. 6 లక్షల్లోపు ఆదాయమున్న వారికి రూ. 4.5 లక్షలకే డబుల్ బెడ్ రూం ఇల్లు!


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మధ్యతరగతి వేతన జీవులకు తీపికబురు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్లో రూ. 6 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల వారికి రాయితీపై ఇళ్లను కట్టివ్వాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కేటీఆర్ చర్చించగా, ఆయన్నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రాంమ్మోహన్ వివరించారు. నగరంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ. 9 లక్షల వరకూ ఖర్చవుతోందని గుర్తు చేసిన ఆయన, మధ్య తరగతి వారికి ఇళ్ల కోసం కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి రూ. 2.5 లక్షలను ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఆపై జీహెచ్ఎంసీ రూ. 2 లక్షలు ఇస్తుందని తెలిపారు. మిగతా మొత్తంలో రూ. 2 లక్షలు లబ్ధిదారులు తొలుత చెల్లించాల్సి వుంటుందని, మిగతాది బ్యాంకు రుణాల ద్వారా అందించే ఆలోచనలో ఉన్నామని వివరించారు. ఈ మొత్తం పథకంపై విధివిధానాలు రూపొందించాల్సి వుందని రాంమ్మోహన్ పేర్కొన్నారు. ఇక ఈ పథకం కార్యరూపం దాలిస్తే మధ్య తరగతి వేతన జీవులకు స్వగృహ కల నెరవేరినట్టే.

  • Loading...

More Telugu News