: 6 జీబీ ర్యామ్, 128 జీబీ కెపాసిటీ తో స్మార్ట్ ఫోన్... ఇండియాకు తెస్తున్న చైనా కంపెనీ!


స్మార్ట్ ఫోన్లలో ర్యామ్ కెపాసిటీ శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 3, 4 జీబీ ర్యామ్ లతో కూడిన ఫోన్లు మార్కెట్లోకి రాగా, తాజాగా చైనా సంస్థ వెర్నీ, 6 జీబీ కెపాసిటీతో కూడిన ఫోన్ 'అపోలో'ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ తయారు చేసిన సరికొత్త హెలియో ఎక్స్ 20 ప్రాసెసర్ ను వాడటం గమనార్హం. 5.5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే, ఫోర్స్ టచ్, 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 21/8 ఎంపీ కెమెరాలు, యూఎస్బీ టైప్-సీ పోర్టు తదితర సౌకర్యాలు ఈ ఫోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. కెమెరా కోసం సోనీ ఐఎంఎక్స్ 230 సెన్సర్ ను వాడటం ఈ ఫోన్ కు అదనపు ప్రత్యేకత. ఆండ్రాయిడ్ మార్ష్ మాలో వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో లభించే ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో విడుదల కానుంది. ఈ ఫోన్ ధర ఎంతన్న విషయాన్ని మార్కెట్లోకి విడుదల చేసిన తరువాత వెల్లడిస్తామని సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News