: మధ్య తరగతి ప్రజలపై దాడి చేస్తున్న మోదీ సర్కారు: రాహుల్ ధ్వజం
చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ తగ్గించడం మధ్య తరగతి ప్రజలపై మోదీ సర్కారు దాడి చేయడమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. "పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస పత్రాలపై ఇస్తున్న వడ్డీ ఇప్పటికే తక్కువగా ఉంది. దాన్ని మరింతగా తగ్గించడం అష్టకష్టాలు పడుతున్న మధ్య తరగతి ప్రజలపై మరో దాడే" అని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన 15 ఏళ్లలో ఇంత తక్కువగా వడ్డీ ఎన్నడూ లేదని ఆయన విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో కేంద్రంపై ట్వీట్లు సంధించారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల విఫలమైందని, పేద ప్రజల జీవితాలను మరింత దిగజార్చేలా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన అన్నారు.