: ప్రముఖులతో కళకళలాడుతున్న ఈడెన్ గార్డెన్స్
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ సందర్భంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ప్రముఖులతో కళకళలాడుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పాక్ ప్రముఖ గాయకుడు షౌకత్ అలీ, భారత్ నటదిగ్గజం అమితాబ్ బచ్చన్, భారతీయ వ్యాపార, సామాజిక సేవాకర్త నీతా అంబానీ, పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, టీమిండియా దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, అఫ్తాబ్ శివదాసాని, ఆయుష్మాన్ ఖురానా, సచిన్ సతీమణి అంజలి, పలువురు బాలీవుడ్ తారలు గ్యాలరీల్లో సందడి చేశారు.