: నేను సినిమాలకు దూరం కాను: పవన్ కల్యాణ్
తాను సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సినిమాల నుంచి దూరమయ్యేది లేదని స్పష్టం చేశారు. అయితే నటనకు కొంత విరామం లభించే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు నటించినంత విరివిగా సినిమాల్లో నటించి అలరించే అవకాశం ఉండకపోవచ్చని మాత్రం అన్నారు. అలాంటప్పుడు పవర్ స్టార్ గా అభిమానులపై పని చేసే పవర్ తగ్గిపోతుంది కదా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పవర్ అనేది పుట్టుకతో రాలేదని, అది పోయినంత మాత్రన ఏమీ జరిగిపోదని అన్నారు. ఏది ఉన్నా లేకున్నా తాను బ్రతికే ఉంటానని, అది చాలని పవన్ కల్యాణ్ చెప్పారు. అభిమానులతో దూరం పెరగదని, అభిమానుల మధ్యకు వెళ్తానని అన్నారు.