: చైనానుంచి జుక‌ర్‌బ‌ర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌... ఆపై విమ‌ర్శ‌లు


సోష‌ల్ మీడియా ఫేస్‌బుక్‌ను నిషేధించిన చైనాలో ఆ సంస్థ సీఈవో జుకర్‌బర్గ్ పర్య‌టిస్తూ ఆ దృశ్యాలు అక్క‌డి నుంచే పోస్ట్ చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. జుక‌ర్‌బ‌ర్గ్ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కడ రోజుకో మైలు చొప్పున పరుగెత్తడం వ్యక్తిగత లక్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చైనాలోని తియానన్మెన్ స్క్వేర్‌ను సంద‌ర్శించారు. ఆ ప్రాంతంలో రన్నింగ్ చేశారు. అంతేకాక తాను ఆ ప్రాంతంలో ఉన్న‌ట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఫేస్‌బుక్‌ నిషేధాజ్ఞ‌లు ఉన్న చైనాలో దాని సీఈవో ఎలా ప‌ర్య‌టిస్తాడ‌ని కొంద‌రూ, చైనా ప్రజలను కస్టమర్లను చేసుకోవడం కోసం జుకర్‌బర్గ్ ఇలా చేస్తున్నార‌ని మ‌రికొంద‌రూ దీనిపై విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. ప్రపంచ అధిక‌ కాలుష్య న‌గ‌ర‌మైన బీజింగ్‌లో ముఖానికి మాస్క్ లేకుండా తిరుగుతున్నావా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే తన పోస్ట్‌ పై వచ్చిన విమర్శలను జుక‌ర్‌బ‌ర్గ్ అంత‌గా పట్టించుకోలేదు.

  • Loading...

More Telugu News