: రష్యా విమానప్రమాద మృతుల్లో ఇద్దరు భారతీయులు


దుబాయి నుంచి రష్యా చేరుకున్న 'ఫ్లై దుబాయ్' ప్యాసెంజర్ బోయింగ్ విమానం ఎఫ్ జెడ్ 981 రొస్తోవ్ అన్ డాన్ విమానాశ్రయంలో ల్యాండవుతూ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 59 మంది మృతి చెందినట్టు రష్యా అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్టు 'ఫ్లై దుబాయ్' సంస్థ తెలిపింది. మృతుల్లో ఇంకా 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెనియన్లు, ఒక ఉజ్బెక్ వాసి ఉన్నట్టు తెలిపింది. వీరిలో నలుగురు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. 2009 నుంచి తమ సంస్థ విమాన సర్వీసులు నడుపుతోందని తెలిపిన 'ఫ్లై దుబాయ్' సంస్థ విమానం కుప్పకూలడం ఇదే తొలిసారని తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపింది. భూమికి 800 అడుగుల ఎత్తులో ఉండగా హరికేన్ స్థాయి గాలుల ప్రభావం కారణంగా విమానం కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News