: సభలో ఎవరెంత సేపు మాట్లాడారో లెక్కలు విప్పిన కేసీఆర్


తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వాదన చేశారు. నేటి సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పై పూర్తి చర్చ జరపాలన్న ఉద్దేశంతో ఏకంగా ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. ఆ తర్వాత సభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గతవారంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు మిగిలిన పార్టీలు మాట్లాడాయి. ఈ సందర్భంగా ఈటల బడ్జెట్ పై స్వపక్షం నుంచి పొగడ్తలు రాగా, విపక్షం నుంచి తెగడ్తలు వినిపించాయి. ప్రభుత్వంపై మరింత మేర విరుచుకుపడేందుకు కాంగ్రెస్ సభ్యులు యత్నించగా... సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. ఒకే పార్టీకి చెందిన సభ్యులు ఎంతసేపు ప్రసంగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో ఏకంగా 2 గంటల 53 నిమిషాల పాటు ప్రసంగించారని ఆయన చెప్పారు. అదే సమయంలో అధికారంలో ఉన్న తమ పార్టీ సభ్యులు మాత్రం కేవలం గంటా 26 నిమిషాలు మాత్రమే మాట్లాడారని ఆయన నిమిషాలతో సహా లెక్కలు విప్పి మరీ చెప్పారు.

  • Loading...

More Telugu News