: వెన్నుపోటే వ్యక్తిత్వం... అబద్ధాలే విశ్వసనీయత: చంద్రబాబుపై జగన్ ఘాటు వ్యాఖ్యలు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో నిరసన తెలుపుతామన్నా, స్పీకర్ మైకివ్వలేదని వాపోయిన జగన్ ఆ తర్వాత ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్... చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు రెండు గుణాలుండాలని జగన్ చెప్పారు. వ్యక్తిత్వం(కేరెక్టర్), విశ్వసనీయత(క్రెడిబిలిటీ)లే అవి అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు వ్యక్తిత్వం వెన్నపోటు పొడవడమేనని పేర్కొన్న జగన్... ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పడమే చంద్రబాబు విశ్వసనీయత అని ఆరోపించారు. నిండు సభలో చంద్రబాబు తనను బెదిరించారని జగన్ అన్నారు. అసభ్య పదజాలాన్ని చంద్రబాబుతో పాటు కేబినెట్ మంత్రులు వాడుతున్నారని ధ్వజమెత్తారు. తన పార్టీ నుంచి టీడీపీలో చేరిన 8 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News