: ఎగిరిపోయిన విమానాలు!... ఏవియేషన్ షో నిర్వాహకులపై సందర్శకుల ఆగ్రహం


హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టులో నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ఏవియేషన్ షో అట్టర్ ఫ్లాప్ గానే ముగిసిందన్న వాదన వినిపిస్తోంది. నిన్నటిదాకా జరిగిన ప్రదర్శనలో పలు సంస్థలకు చెందిన పెద్ద విమానాలు కనువిందు చేశాయి. నేటి నుంచి సామాన్య పౌరులకు కూడా ఈ ప్రదర్శనలోకి అనుమతించారు. రూ.300 ఎంట్రీ టికెట్ కొనుగోలు చేసిన సందర్శకులు తీరా అక్కడికెళితే... నిన్నటిదాకా కనువిందు చేసిన పెద్ద విమానాలు కంటికి కనిపించలేదు. నిన్న రాత్రే సదరు పెద్ద విమానాలు వాటి వాటి గమ్యస్థానాలకు ఎగిరిపోయాయి. ఏవో రెండు చిన్న విమానాలు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా సమీపం నుంచి చూసేందుకు సందర్శకులకు అనుమతి లభించలేదు. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న సందర్శకులు... రూ.300 వసూలు చేసి రెండు చిన్న విమానాలను చూపిస్తారా? అంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్శకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిర్వాహకులు తలలు పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News