: అమరావతిలో అధునాతన హైకోర్టు: చంద్రబాబు ప్రకటన


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో అధునాతన సౌకర్యాలతో హైకోర్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. హైదరాబాదులో నేటి ఉదయం ప్రారంభమైన న్యాయాధికారుల సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఆధునిక యుగంలో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కోర్టు కార్యకలాపాల్లో వేగాన్ని పెంచుతామని ఆయన పేర్కొన్నారు. తద్వారా సత్వర న్యాయం అందేలా న్యాయవ్యవస్థకు తమ వంతు సహకారం అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News