: పాక్ క్రికెట‌ర్ ఆమిర్‌కు కోహ్లీ బ్యాట్ గిఫ్ట్


ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లీ.. పాక్ పేస‌ర్‌ మహ్మద్ ఆమిర్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశాడు. ఈడెన్ గార్డెన్స్ లో ప్రీ మ్యాచ్ ప్రాక్టీస్ సెష‌న్‌లో ఆమిర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ కోహ్లీ ఓ బ్యాట్ ను బహూకరించాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌తో ఇన్నాళ్లూ చేదు అనుభ‌వాలు ఎదుర్కొన్న ఆమిర్‌కు.. కోహ్లీ బ్యాట్ గిఫ్ట్ ద్వారా తిరిగి స్వాగ‌తం ప‌లికాడు. ఆమిర్ స్కిల్ ఫుల్ బౌల‌ర్ అని, అత‌నికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాన‌ని ఇటీవ‌లే ఆసియా కప్ సమయంలో కోహ్లీ వ్యాఖ్యానించాడు. భారత్‌లో మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్‌ను గిఫ్టుగా ఇస్తానని ఆమీర్‌కు విరాట్ చెప్పాడు. కోహ్లీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని ఆమిర్ అన్నాడు. కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తో మునుముందు పాకిస్థాన్ తరపున రాణిస్తాన‌ని అన్నాడు. ధోనీ సేన ఈడెన్ గార్డెన్స్‌లో నేడు పాకిస్థాన్ టీమ్‌తో త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News