: సుప్రీం తీర్పుతో ‘ఉమ్మడి సంస్థల’లో మెజారిటీ వాటా ఏపీదే!


రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య ఉమ్మడి సంస్థలకు చెందిన నిధులతో పాటు ఆస్తుల వాటా విషయంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న ప్రతిష్టంభనకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న తెర దించింది. అంతేకాకుండా ఈ విషయంలో తెలంగాణకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెండు రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏర్పాటైన సంస్థలకు చెందిన ఆస్తులు ఒక్క తెలంగాణకు మాత్రమే ఎలా చెందుతాయంటూ ప్రశ్నించిన కోర్టు... విభజన చట్టంలో పేర్కొన్న మేరకు 58:42 నిష్పత్తి చొప్పున ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి షాకివ్వగా... ఆర్థిక లోటులో చిక్కుకున్న ఏపీకి భారీగా నిధులు చేకూర్చనుంది. ప్రస్తుతం ఉమ్మడి సంస్థలకు చెందిన రూ.145 కోట్ల నిధుల్లో ఏపీకి ఏకంగా రూ.85 కోట్లు దక్కనున్నాయి. ఇక దాదాపు రూ.15,000 కోట్ల విలువైన ఉమ్మడి సంస్థల ఆస్తుల్లోనూ మెజారిటీ వాటా ఏపీకి దక్కనుంది. ఈ ఆస్తుల్లో ఒక్క ఉన్నత విద్యా మండలికి చెందిన ఆస్తులే రూ.2 వేల కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఆస్తుల పంపిణీ పూర్తి అయితే, ఏపీ ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News