: ప్యారిస్ దాడి ప్రధాన నిందితుడు అబ్దెస్లామ్ అరెస్ట్!... బ్రస్సెల్స్ లో పట్టుబడిన వైనం


ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో మారణ హోమం సృష్టించిన ఐఎస్ ఉగ్రవాది, ఈ దాడిలో ప్రధాన నిందితుడు సలాహ్ అబ్దెస్లామ్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో నిన్న ఆ దేశ పోలీసులు జరిపిన మెరుపు దాడిలో అబ్దెస్లామ్ దొరికిపోయాడు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అబ్దెస్లామ్ కాలికి తూటా గాయమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బెల్జియం పోలీసులు బ్రస్సెల్స్ లోని ఓ రహస్య స్థావరంపై మెరుపు దాడి చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు అబ్దెస్లామ్ విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అతడిని చుట్టుముట్టిన పోలీసులు అతడికి సంకెళ్లు వేశారు. ఈ మేరకు అబ్దెస్లామ్ ను అరెస్ట్ చేశామని బెల్జియం ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి థియో ఫ్రాంకెన్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News