: 'మాతా' అన్న ప‌దం ఇబ్బందిగా ఉంటే కనుక 'భార‌త్ అమ్మీకి జై' అనండి!: అసదుద్దీన్ కి నటి షబానా అజ్మీ సలహా


'భారత్ మాతాకీ జై' అనను అంటూ ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తన భర్త జావెద్ అక్తర్‌తో కలిసి శుక్ర‌వారం 'ఇండియా టుడే' కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. 'మాతా' అనే పదంతోనే సమస్య అయితే.. ఆ ప‌దానికి బదులుగా అమ్మీ అని ఓవైసీ ప‌లుకుతాడా? అంటూ వ్యాఖ్యానించారు. భారత్ మాతాకీ జై అనడానికి బదులుగా.. 'భారత్ అమ్మీ కీ జై' అనడానికి కూడా ఏమైనా అభ్యంత‌రం ఉందా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇలా చేస్తే ఒవైసీకి బహుశా ఏ ఇబ్బందీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ఆమె అన్నారు. గొంతు మీద కత్తిపెట్టినా 'భారత్ మాతాకీ జై' అనను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. షబానా భర్త, రచయిత జావేద్ అక్తర్ కూడా అసదుద్దీన్ వ్యాఖ్యలపై రాజ్య‌స‌భ‌లో మండిపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News