: మోకాలి గాయంతో టీ20 వ‌రల్డ్‌క‌ప్ నుంచి మ‌లింగా ఔట్


టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక‌కు గట్టి దెబ్బ‌త‌గిలింది. ఆ దేశ కీల‌క‌ ఆట‌గాడు, ఫాస్ట్ బౌల‌ర్‌ లసిత్ మలింగ మోకాలి గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. శ్రీలంక-అప్ఘనిస్తాన్ మ‌ధ్య‌ నిన్న జ‌రిగిన టీ20 మ్యాచ్‌లోనూ మలింగ ఆడలేదు. గాయం నుంచి కోలుకోకపోవ‌డంతో మ‌లింగ‌ టోర్నీ నుంచి వైదొలగుతున్న‌ట్లు శ్రీలంక క్రికెట్ శుక్రవారం ప్రకటించింది. అతని స్థానంలో మ‌రో బౌలర్‌ను జట్టులోకి తీసుకుంటామని పేర్కొంది. టోర్నీలో పాల్గొనేందుకు వచ్చినప్పటి నుంచి మలింగ గాయంతో బాధపడుతున్నాడని శ్రీ‌లంక క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. గాయం తగ్గకపోవడంతో అతడ్ని తిరిగి స్వ‌దేశానికి పంపించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. మలింగ లేకపోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఈ నెల 20(ఆదివారం)న బెంగ‌ళూరులో వెస్టిండీస్‌తో శ్రీ‌లంక త‌ల‌ప‌డ‌నుంది.

  • Loading...

More Telugu News