: సభ్యుల నైతిక ప్రవర్తనను మార్చే సాధనాలు రాలేదు: సురేష్ రెడ్డి


శాసనసభలో సభ్యుల వ్యక్తిగత వ్యవహార శైలిని మార్చగలిగే సాధనాలు అందుబాటులోకి రాలేదని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చెప్పారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడుతూ, శాసనసభ్యుల వ్యక్తిగత ప్రవర్తనను వారే నియంత్రించుకోవాలని సూచించారు. ప్రజలు వారిని గమనిస్తారని ఆయన గుర్తుచేశారు. అదే సమయంలో స్పీకర్ ఎంత నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారన్న వ్యవహారాన్ని కూడా గమనిస్తున్నారన్న విషయం గుర్తించాలని ఆయన సూచించారు. ఇక్కడ ట్రాన్స్ పరెంట్ ప్రసారాలు సాగుతున్న తరుణంలో శాసన సభ్యులు వ్యక్తిగత ప్రవర్తనను వారే సరిదిద్దుకోవాలని, అదే సమయంలో స్పీకర్ ఎంత సమర్థవంతంగా సభను నిర్వహిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తుంటారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News