: పంజాబ్ లో భారత వ్యతిరేక నినాదాలతో సినిమా షూటింగును అడ్డుకున్న స్థానికులు


పొరపాటున పంజాబ్ సరిహద్దులు దాటి పాక్ జైలులో దశాబ్దాలుగా మగ్గిపోయి, 2013లో అక్కడి జైల్లో హత్యకు గురైన సరబ్ జీత్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా షూటింగ్ ను సరిహద్దుల్లో అడ్డుకున్నారు. 'సరబ్ జీత్' సినిమా షూటింగ్ వాఘా సరిహద్దుల్లోని ఓ గ్రామం వద్ద జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా పాకిస్థాన్ లో జరుగుతున్న ఓ కార్యక్రమంలో దర్శన్ కుమార్ పాత్రలో నటిస్తున్న వ్యక్తి ప్రసంగం చేయాల్సి ఉంది. ఇంతలో ప్లకార్డులు పట్టుకుని వచ్చిన కొంత మంది స్థానికులు ఉర్దూలో భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తూ షూటింగును అడ్డుకున్నారు. అనంతరం ఈ చిత్ర నిర్మాత జాఫర్ మొహదీని వారు అదుపులోకి తీసుకున్నారు. తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ అతనిని రెండు గంటలపాటు నిర్బంధించారు. ఈ సినిమా షూటింగ్ కు నిర్దేశిత ప్రాంతంలో పూర్తి అనుమతి ఉందని చిత్ర బృందం పోలీసులకు వివరించి, వారి సాయంతో జాఫర్ ను విడిపించారు. సరబ్ జీత్ పాత్రలో రణదీప్ హుడా నటిస్తుండగా, ఆయన సోదరి పాత్రలో ఐశ్వర్యా రాయ్ నటిస్తోంది. ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News