: మళ్లీ ఆందోళన బాటలో జాట్ లు... హర్యానాలో ఇంటర్నెట్ సేవలు బంద్


రిజర్వేషన్ల డిమాండ్ తో హర్యానా అట్టుడుకుతోంది. ఆ రాష్ట్రంలోని జాట్ కులస్థులు తమకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. వారి ఆందోళనలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చి వారితో గతంలో ఆందోళన విరమింపజేసింది. అయితే శాసనసభ సమావేశాలు ముగియడంతో బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీస్తూ జాట్ లు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హర్యానా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. అలాగే మొబైల్ ఇంటర్నెట్ డేటా 2జీ, 3జీ, 4జీ సేవలను నిలిపేస్తున్నట్టు పేర్కొంది. వాట్స్ యాప్ ద్వారా మెసేజ్ లు పాస్ అవుతున్నందున, ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తున్నామని స్పష్టం చేసింది. వివిధ ప్రాంతాల్లో ఐదుగురుకి మించి వ్యక్తులు కలిసి తిరగకూడదని పోలీసులు నిబంధనలు విధించారు.

  • Loading...

More Telugu News