: 142 పరుగులకే పరిమితమైన కివీస్...రాణించిన ఆసీస్ బౌలర్లు!
టీ20 వరల్డ్ కప్ లో పటిష్ఠ జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గుప్తిల్ (39), విలియమ్సన్ (24) రాణించారు. వీరి ధాటికి కివీస్ భారీ స్కోరు సాధిస్తుందని అంచనా వేశారు. అయితే అంచనాలను తల్లకిందులు చేస్తూ గుప్తిల్ ను జేమ్స్ ఫల్కనర్ బోల్తా కొట్టించాడు. అనంతరం మ్యాక్స్ వెల్ స్పెల్ లో వరుస ఓవర్లలో విలియమ్సన్, ఆండర్సన్ (3)లను పెవిలియన్ పంపి సత్తాచాటాడు. అనంతరం నిలదొక్కుకున్నట్టు కనిపించిన మున్రో (23)ను మార్స్ అవుట్ చేశాడు. రాస్ టేలర్ (11) విఫలమయ్యాడు. ఇలియట్ (27) ఆకట్టుకున్నప్పటికీ రన్ అవుట్ గా వెనుదిరిగాడు. రోంచీ (6), శాంటనర్ (1) రన్ అవుట్ కావడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జేమ్స్ ఫాల్కనర్, మ్యాక్స్ వెల్ చెరో రెండు వికెట్లు తీసి రాణించగా మార్ష్, వాట్సన్ చెరో వికెట్ తీసి వారికి చక్కని సహకారమందించారు. 143 పరుగుల విజయ లక్ష్యంతో ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.