: మెజార్టీ ఉన్నంత మాత్రాన రెండు రెళ్లు ఐదు అవ్వదు!: అధికారపక్షంపై మండిపడ్డ అంబటి


అధికార పార్టీకి మెజార్జీ ఉన్నంత మాత్రాన.. రెండు రెళ్లు ఐదు కాదని, నాలుగే అవుతుందని, లెక్క లెక్కేనని అది ఎప్పుడూ తప్పదని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై ఆయన మండిపడ్డారు. తమకు మెజార్టీ ఉందని చెప్పి అధికార పార్టీ ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని, హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తోందని విమర్శించారు. అధికార పక్షం తీరును నిరసిస్తూ పోరాటం చేస్తామని, రోజాకు అన్యాయం జరుగుతోందని, ఆమెకు అన్యాయం జరిగితే సహించమని అన్నారు. ఆమెను అసెంబ్లీలోకి రానీయకుండా అడ్డుకున్నంత కాలం తాము ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు కొనసాగిస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News