: యాదాద్రి అధికారులపై గవర్నర్ ఆగ్రహం!


యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహుని కల్యాణం జరగాల్సిన సమయం కన్నా ఆలస్యంగా జరగడంతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్వతహాగా భక్తిపరుడైన నరసింహన్, కల్యాణోత్సవం ఆలస్యంగా నిర్వహించడంపై ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారని ప్రశ్నించిన ఆయన, ఉత్సవం పూర్తి కాకుండానే తిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే స్వామివారికి సేవల్లో లోపాలు జరుగుతున్నాయని, ఇటువంటివి కొనసాగితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. తన సతీమణితో కలసి యాదగిరిగుట్ట పర్యటనకు వెళ్లిన గవర్నర్, అక్కడ పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News