: రేపు ప్రివిలేజ్ కమిటీ అత్యవసర భేటీ... రోజా, అనితలకు నోటీసులు
రోజా సస్పెన్షన్ వ్యవహారం మరోసారి ప్రివిలేజ్ కమిటీ ముందుకు వచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుండగా, వ్యక్తిగతంగా హాజరు కావాలని పలువురికి నోటీసులు వెళ్లాయి. వైకాపా ఎమ్మెల్యేలు రోజా, జ్యోతుల నెహ్రూ, కొడాలి నాని, కోటంరెడ్డి, చెవిరెడ్డిలతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనితకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులను పంపింది. కాగా, రోజా అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఈ సమావేశానికి, ఆపై జరిగే విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.