: చైనా వీధుల్లో పరుగులు తీసిన జుకెర్ బర్గ్


ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ చైనా వీధుల్లో పరుగులు తీశారు. ఫేస్ బుక్ సీఈవోగా సంస్థను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు జుకెర్ బర్గ్ అన్ని అవకాశాలను తనకు అనుకూలంగా మలచుకుంటారు. ఫ్రీ బేసిక్స్ పేరిట సామాజిక మాథ్యమాలపై గుత్తాధిపత్యం సాధించే దిశగా భారత్ లో వేసిన అడుగులకు ట్రాయ్ చెక్ చెప్పడంతో...చాలా కాలంగా ఫేస్ బుక్ నిషేధంలో ఉన్న చైనాను దారికి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చైనా పర్యటనలో ఉన్న జుకెర్ బర్గ్ బీజింగ్ రావడం ఆనందంగా ఉందని తన ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఉదయం తియాన్మెన్ నుంచి టెంపుల్ ఆఫ్ హెవెన్ వరకు జాగింగ్ చేశానని పేర్కొంటూ కొన్ని ఫోటోలను పోస్టు చేశారు. గతంలో తన కుమార్తెకు మాండరీన్ భాషలో మంచి అర్థం వచ్చేలా ఓ పేరు సూచించాలంటూ చైనా అధ్యక్షుడిని జుకెర్ బర్గ్ కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News