: ముస్లింలలో మైనారిటీలుగా ఉన్న వారిని రక్షించేందుకు మిలటరీ యాక్షన్ తప్పదు: హెచ్చరించిన అమెరికా


ఐఎస్ఐఎస్ నియంత్రణలో ఉన్న సిరియా, ఇరాక్ దేశాల్లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, ఉగ్రసంస్థ మరింత మారణహోమాన్ని సృష్టించేందుకు సిద్ధంగా ఉందని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సిరియా రీజియన్లో నిఘాను మరింతగా పెంచనున్నట్టు తెలిపింది. "సిరియా, ఇరాక్ లలో ఏం జరుగుతోంది? తీవ్ర కష్టాలు ఏర్పడుతున్నాయి. ముస్లిం మైనారిటీ వర్గాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వీరందరినీ మట్టుబెట్టడమే తమ ఉద్దేశమని వారు ప్రచారం చేసుకుంటున్నారు" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ మీడియాకు తెలిపారు. ఇదే విషయాన్ని అధ్యక్షుడు ఒబామా ఎన్నోమార్లు తన ప్రసంగాల్లో ప్రస్తావించారని గుర్తు చేశారు. ఉగ్ర సైన్యానికి వ్యతిరేకంగా సైనిక చర్యలకు అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ముస్లింలలో మైనారిటీలుగా ఉన్న వారిని రక్షించేందుకు మిలటరీ యాక్షన్ తప్పదని అన్నారు.

  • Loading...

More Telugu News