: ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టులో ఊరట... ప్రభుత్వ ప్రకటనలపై చిత్రాలకు అవకాశం


రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికలకు ఇచ్చే ప్రకటనల్లో గవర్నర్, ముఖ్యమంత్రుల ఫోటోలను ముద్రించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించుకుంటున్నట్టు తెలిపింది. ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిస్ మినహా మరెవరి చిత్రాలనూ ప్రచురించ వద్దని గతంలో ఆదేశాలు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం, ఆపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని విచారించిన జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ మేరకు తాజా ఆదేశాలిచ్చింది. గత సంవత్సరం మే 13న త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ ప్రకటనలపై నిబంధనలను మార్చగా, ఆపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై అక్టోబర్ 27న కేంద్రం సైతం రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలించాలని కోరుతూ ఇంప్లీడ్ అయింది. ఈ పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు తాజా నిర్ణయాన్ని వెలువరించింది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలకూ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News