: జగనన్నా మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరికి జరిగింది అన్యాయం?: అనిత సూటి ప్రశ్న


"ఓ చెల్లిగా అడుగుతున్నాను. జగనన్నా అన్యాయం ఎవరికి జరిగింది?... రోజాకా? నాకా? నాకు జరిగిన అన్యాయంపై ఒక్క మాటన్నా మాట్లాడారా? రోజాను వెంటనే మీ పార్టీ నుంచి తప్పించండి. లేకుంటే ఆమె నోటిని అదుపులో పెట్టండి. ప్రజలు మిమ్మల్ని కనీసం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రోజాలాంటి వారిని మీ పక్కనే మరింతకాలం ఉంచుకుంటే, ఆ స్థానం కూడా దక్కదు. ఓ చెల్లిగా ఈ మాట చెబుతున్నాను" అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, హైకోర్టు ఉత్తర్వుల్లో కేవలం సెక్షన్ తప్పుగా ఉందని మాత్రమే పేర్కొన్నారని వివరించారు. అసభ్య హావభావాలను ప్రదర్శిస్తూ, సాటి మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసే ఆమెను వెనకేసుకు రావడం ఎంత మాత్రం సమంజసమని జగన్ ను ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News