: రోజాను అరెస్ట్ చేయించడం నాకు చేతగాదనుకుంటున్నారా?: టీడీపీ ఎమ్మెల్యే అనిత


తనకేదో అన్యాయం జరిగిపోయిందని వైకాపా ఎమ్మెల్యే రోజా అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత నిప్పులు చెరిగారు. ఆమె తనకు చేసిన అన్యాయానికి, ఏదైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి నిమిషాల్లో ఆమెను అరెస్ట్ చేయించడం తనకు చేతగాదనుకుంటున్నారా? అని ప్రశ్నించిన ఆమె, స్పీకర్ పై ఉన్న గౌరవంతోనే తానాపని చేయలేదని అన్నారు. రోజా తనపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తనకింకా న్యాయం జరగలేదని అన్న అనిత, ఎందుకు సస్పెండ్ చేశారో రోజా కోర్టుకు చెప్పిందా? అని ప్రశ్నించారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన రోజాకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదని అన్నారు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని, అందువల్లే స్పీకర్ ను ఆశ్రయించానని, తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతుగా నిలిచారని అన్నారు.

  • Loading...

More Telugu News