: కంచి పీఠాధిపతికి చెన్నై కోర్టు సమన్లు... 28న విచారణకు హాజరుకావాలని తాఖీదు


కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి చెన్నై కోర్టు నుంచి నిన్న సమన్లు జారీ అయ్యాయి. ఆడిటర్ రాధాకృష్ణన్ పై జరిగిన దాడి కేసులో జయేంద్ర సహా 9 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ప్రస్తుతం చెన్నై మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలో జరుగుతోంది. ఏప్రిల్ 28న జరగనున్న విచారణకు హాజరుకావాలని జయేంద్రకు నిన్న కోర్టు నోటీసులు జారీ చేసింది. జయేంద్రతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఎనిమిది మందికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News