: సభ లోపల అధికార పక్షం... ప్రవేశ ద్వారం వద్ద జగన్ సహా విపక్షం బైఠాయింపు


ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అధికార పక్ష సభ్యులంతా సభ లోపలికి వెళ్లిపోగా, తన పార్టీ ఎమ్మెల్యే రోజాను అనుమతించని కారణంగా విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ ప్రవేశ ద్వారం బయట బైఠాయించారు. ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా... నిన్నటి కోర్టు తీర్పుతో నేటి ఉదయం సభకు వచ్చారు. సభ ప్రాంగణంలోకి రోజాను అనుమతించగా... జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు రోజాను వెంటబెట్టుకుని సభలోపలికి వెళ్లేందుకు యత్నించారు. అయితే అప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకున్న మార్షల్స్ ప్రవేశ ద్వారం వద్ద రోజాను అడ్డుకున్నారు. తమకున్న ఆదేశాల మేరకు రోజాను సభలోపలికి అనుమతించేది లేదని వారు తెగేసి చెప్పారు. దీంతో మార్షల్స్ తో వాగ్వాదానికి దిగిన జగన్... రోజా సహా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అక్కడే బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News