: ‘రాయల్ చాలెంజర్స్’కు కొత్త బాస్!... డైరెక్టర్ పదవికి మాల్యా రాజీనామా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కీలక జట్టుగా భావిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త బాస్ వచ్చేశారు. ఇప్పటిదాకా ఆ జట్టు యజమానిగా కొనసాగిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... జట్టు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలను ఎగవేసిన ఆయన ఎంచక్కా లండన్ చెక్కేశారు. ఈ క్రమంలో జట్టు డైరెక్టర్ పదవికి మాల్యా రాజీనామా చేశారని నిన్న ఆ జట్టు యాజమాన్యం బీసీసీఐకి తెలిపింది. మాల్యా స్థానంలో ఆయన కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అమృత్ థామస్ వ్యవహరించనున్నట్లు ఆ జట్టు పేర్కొంది.