: టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో ఆలోచనకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బౌలింగ్ ప్రారంభించిన లంకేయులు కట్టుదిట్టమైన బంతులతో ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మన్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తొలి రెండు ఓవర్లలో కేవలం ఆరు పరుగులు మాత్రమే సమర్పించడం విశేషం. అనంతరం షెహజాద్ (8)ను పెవిలియన్ కు పంపిన మాథ్యూస్ తొలి వికెట్ సాధించాడు. అనంతరం ఆఫ్ఘన్ బ్యాట్స్ మన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో నూర్ అలీ (19), అస్గర్ (6) ఉన్నారు.

  • Loading...

More Telugu News