: బ్యాంకుల నుంచి మాల్యా తీసుకున్న ప్రతిపైసా వసూలు చేస్తాం: అరుణ్ జైట్లీ


బ్యాంకులన్నీ విజయ్ మాల్యాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. విజయ్ మాల్యా వివాదానికి సంబంధించి ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయన్నారు. ‘మాల్యా దేశం విడిచి వెళ్లి పోయారా?’ అన్న ప్రశ్నకు ఆయన స్పందించలేదు. కాగా, దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా ఇంతవరకూ తిరిగి రాలేదు. దీంతో ఆయన ఆస్తుల వేలం ప్రక్రియను ఈరోజు నుంచి ప్రారంభించారు. పలు బ్యాంకులకు సుమారు రూ.9 వేల కోట్లు ఆయన బకాయిపడ్డారు.

  • Loading...

More Telugu News