: నటుడు, నిర్మాత, దర్శకుడిగా... మూడు పాత్రల్లో రణ్ బీర్ కపూర్!


ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ కొత్త బాధ్యతలు తలకెత్తుకోనున్నాడు. హీరో కాకముందు సహాయ దర్శకుడిగా పని చేసిన రణ్ బీర్ కపూర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. సొంత బ్యానర్ ఆర్ కే ఫిల్మ్స్ పై తొలి సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఈ సినిమాలో తనే ప్రధానపాత్ర పోషిస్తాడు. అలాగే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టి, చిరకాల కోరిక తీర్చుకోనున్నాడు. అయితే నిర్మాత, దర్శకుడు, నటన బాధ్యతలు తీసుకోవడం వల్ల ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకునేందుకు తన దర్శక మిత్రులు అనురాగ్ బసు, ఇంతియాజ్ అలీ, అయాన్ ముఖర్జీల్లో ఒకరి సహాయం తీసుకోనున్నాడని బాలీవుడ్ సమాచారం.

  • Loading...

More Telugu News