: ఊపిరి ఆగినంతపనైంది... హంసానందిని బంగీ జంప్ అనుభవం


టాలీవుడ్ ప్రముఖ ఐటెం క్వీన్ హంసానందిని బంగీ జంప్ చేసింది. న్యూజిలాండ్ టూర్ కి వెళ్లిన హంసానందిని సాహస క్రీడ బంగీ జంప్ చేసింది. సాహస క్రీడలను ఇష్టపడేవారు చేసే బంగీ జంప్ చేసేందుకు పురుషులే వెనుకంజ వేస్తారు. అలాంటిది నటి హంసానందిని అవలీలగా బంగీజంప్ చేసి అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుంది. కాగా, 'బావగారూ బాగున్నారా' సినిమా సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బంగీ జంప్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఆ తరువాత 'సుబ్బు' సినిమా సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బంగీ జంప్ చేసి ధైర్యవంతుడనని నిరూపించుకున్నాడు. కాగా, నటీమణుల్లో హంసానందిని తొలిసారి బంగీ జంప్ చేసి సత్తాచాటింది. ఈ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పెడుతూ, బంగీ జంప్ చేస్తున్నప్పుడు ఊపిరి ఆగినంతపనైందని చెప్పింది. బంగీ జంప్ చేసేందుకు తొలుత తటపటాయించిన హంసానందిని సహాయకుల ప్రోత్సాహంతో బంగీ జంప్ చేసి సత్తాచాటింది.

  • Loading...

More Telugu News