: ఏప్రిల్ 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ: అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ
అమెరికాలో ఉద్యోగం చేయాలని భావించే భారతీయులకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ విభాగం శుభవార్త వినిపించింది. 2017 ఆర్థిక సంవత్సరానికిగాను హెచ్1బీ వీసాలు జారీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం నిర్ణయించింది. దీంతో వచ్చే నెల 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు, అక్టోబర్ 1 నుంచి వీసాలు జారీ చేయనున్నట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకటించింది. అయితే ఈసారి కంప్యూటర్ లాటరీ ద్వారా వీసాలు జారీ చేయనున్నట్టు వెల్లడించింది. అమెరికన్ సంస్థల్లో సైన్స్, కంప్యూటర్ విభాగాల్లో ఈ తరహా వీసా విధానం అమలులో ఉన్నట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. వీసా జారీలో కొత్త నియమ నిబంధనలు చేర్చలేదని వారు స్పష్టం చేశారు.