: ఏపీలో క్యాడ్ బరీ చాక్లెట్ల తయారీకి సిద్ధమవుతున్న సంస్థ


ఆంధ్రప్రదేశ్ లో క్యాడ్ బరీ చాక్లెట్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీసిటీ సెజ్ లో వచ్చే నెల 25న క్యాడ్ బరీ ప్లాంట్ తొలిదశ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కలిసి, ఈ మేరకు ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో క్యాడ్ బరీ ప్లాంటు ఏర్పాటుతో కోకో పంట సాగుకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. కాగా, రూ.1000 కోట్లతో 134 ఎకరాల్లో క్యాడ్ బరీ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. మొత్తం నాలుగు దశల్లో ప్లాంట్ నిర్మాణపు పనులు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News