: పవన్ కల్యాణ్ ఏమి హీరో? అతనొక జోకర్, కార్టూన్: బాలీవుడ్ నటుడు కమాల్ రషీద్ సెటైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్ విపరీత వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు కమాల్ ట్వీట్లు చేశాడు. పవన్ కల్యాణ్ పేరు సరిగ్గా కూడా తెలియని కమాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పవన్ కల్యాణ్ కు బదులుగా పవన్ కల్యాణ్ సింగ్ అని పేర్కొన్న ఆ ట్వీట్లలో ఏమన్నాడంటే..‘పవన్ కల్యాణ్ లాంటి వాడే హీరో అయినప్పుడు, ప్రపంచంలో ఎవరైనా సూపర్ స్టార్ కావచ్చు. దక్షిణాది ప్రజలకు అసలేమైంది? ఒక కార్టూన్ లా ఉండే ఈ హీరో సినిమాలను ఎలా చూస్తున్నారు? వెరీ బ్యాడ్ ఛాయిస్. ఈ జోకర్ హీరో సినిమాలు చూడటం కన్నా రాజ్ పాల్ యాదవ్ సినిమాలు చూడటానికి ఇష్టపడతాను’ అంటూ తీవ్రమైన ట్వీట్లు చేశాడు. గతంలో కూడా కమాల్ ఇలాగే బాలీవుడ్ హీరోలపై నోరు పారేసుకుని వారి ఆగ్రహానికి గురయ్యాడు.