: కాంగ్రెస్ పాపాలను సరిదిద్ది, ‘ప్రాణహిత’ నీళ్లు తెస్తాం: మంత్రి హరీష్ రావు


మహారాష్ట్రలోని ప్రాణహిత ఎత్తుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి హయాంలో చేసిన పాపాలను సరిదిద్ది ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో హరీష్ రావు మాట్లాడారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారని, అందుకు అక్కడి సర్కార్ అభ్యంతరం తెలిపిందని అన్నారు. 2007లో ‘ప్రాణహిత’ తొలి జీవో వస్తే 2013 వరకు పట్టించుకోలేదని, ఆ ప్రాజెక్టు పేరిట రూ.1,400 కోట్ల బిల్లులు సృష్టించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News