: ‘శ్రీమంతుడి’ గ్రామంలో నమ్రత!... వదినతో కలిసి బుర్రిపాలెం వెళ్లిన మిసెస్ ప్రిన్స్


టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ పర్యటించారు. మహేశ్ బాబు సోదరితో కలిసి బుర్రిపాలెం వెళ్లిన నమ్రత అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహేశ్ బాబు అభిమానులు, గ్రామస్తులు కలిసి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడారు. ఆంగ్లంలో నమ్రత మాట్లాడగా, అక్కడి ఓ వ్యక్తి దానిని తెలుగులోకి అనువదించారు. మరోమారు మహేశ్ బాబుతో కలిసి గ్రామానికి వస్తానని నమ్రత ప్రకటించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు. మహేశ్ బాబు సతీమణి, సోదరిని చూసి బుర్రిపాలెం గ్రామస్తులు కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News