: కచ్చితంగా ఈరోజు అసెంబ్లీకి హాజరవుతాను: ఎమ్మెల్యే రోజా


కచ్చితంగా ఈరోజు అసెంబ్లీకి వెళతానని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమెపై అసెంబ్లీ విధించిన ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన అనంతరం రోజా విలేకరులతో మాట్లాడారు. కాపీ ఆర్డరు రాగానే అసెంబ్లీకి వెళతానని, అసెంబ్లీ అధికారులకు కూడా సంబంధిత మెయిల్ పెడతామని కోర్టు అధికారులు చెప్పారని రోజా పేర్కొన్నారు. తాను 1999లో రాజకీయాల్లోకి వచ్చానని, ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆరోజు నుంచి ఈరోజు వరకు ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత పెద్ద నాయకుడిపైన అయినాసరే పోరాటం చేస్తానన్నారు.

  • Loading...

More Telugu News