: ఇద్దరు పిల్లల గొంతు కోసి, చంపిన తల్లి


సికింద్రాబాద్ లోని మారేడ్ పల్లి టీచర్స్ కాలనీలో దారుణం జరిగింది. కన్నతల్లే తన ఇద్దరి కూతుళ్ల గొంతు కోసి, వారిని హతమార్చింది. నిన్నరాత్రి తల్లి రజని తన కూతుళ్లు అశ్విక(7), తనిష్క(5)ల గొంతు కోయడంతో వారు ప్రాణాలు విడిచారు. వారిని హతమార్చిన అనంతరం రజని ట్యాంక్ బండ్ కు చేరుకుంది. ఆత్మహత్యాయత్నానికి సిద్ధమవుతున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పిల్లలను హతమార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రజనీ, విజయ్ దంపతులు. టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు. వారితో పాటు వినయ్ తల్లి, సోదరి కూడా ఉంటున్నారు. అయితే, కొన్నాళ్లుగా వారి మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు తెలుస్తోందని, ఈ క్రమంలోనే దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వినయ్, రజనీ దంపతులు తుకారం గేట్ పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, పిల్లలను హతమార్చింది తానేనని రజని అంగీకరించిందని, ఆమె భర్తపై కూడా పలు ఆరోపణలు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రజని మానసిక స్థితిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News