: వంట గ్యాస్ సబ్సిడీ కట్ అయినట్టు మెసేజ్ వచ్చిందా? కారణమిదే!


మీరు సంవత్సరానికి రూ. 10 లక్షల కన్నా అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారా? అయితే, వంట గ్యాస్ రాయితీని వదులుకుని, మార్కెట్ రేటుకు కొనుగోలు చేయాల్సిందే. ఈ మేరకు గత వారం రోజులుగా వేలాది మంది సెల్ ఫోన్లకు మెసేజ్ వస్తోంది. దేశంలో దాదాపు 3 లక్షల మందికి పైగా సాలీనా రూ. 10 లక్షలకు మించి సంపాదిస్తున్నారని ఆదాయపు పన్ను శాఖ గుర్తించిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్ జిందాల్ వెల్లడించారు. వీరందరికీ మెసేజ్ లు పంపుతున్నామని తెలిపారు. ఒకవేళ వీరి ఆదాయం అంతకన్నా తక్కువగా ఉంటే, ఆ మేరకు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కు డిక్లరేషన్ ఇవ్వాల్సి వుంటుందని వివరించారు. అధికాదాయ వర్గాల వారు స్వచ్ఛందంగా రాయితీలను వదులుకునేందుకు ముందుకు రావాలని కోరగా, 85.24 లక్షల మంది స్పందించారని తెలిపారు. దీని ద్వారా కేంద్ర ఖజానాకు రూ. 965 కోట్లు మిగిలిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News