: అమరావతి ప్లాన్ బాగాలేదంటూ 8 వేలకు పైగా అభ్యంతరాలు!


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర ప్రణాళిక సరిగ్గా లేదంటూ రైతులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం ప్రణాళికపై అభ్యంతరాలుంటే చెప్పాలని ప్రభుత్వం కోరగా, 8,084 అభ్యంతరాలు వచ్చాయి. వీటిల్లో అత్యధికం అగ్రీజోన్ గా పేర్కొన్న ప్రాంతంపైనే ఉన్నాయని తెలుస్తోంది. అమరావతిలో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అత్యధిక ప్రాంతాన్ని రాజధాని పరిధిలోకి ప్రభుత్వం తీసుకురాగా, టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి సైతం వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా మారిపోయిన ఏరియాను సైతం అగ్రికల్చర్ జోన్ గా పేర్కొనడం వల్ల తమకు నష్టం కలుగుతుందని ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News