: ఇండియాలో పెరిగిన మంత్రగాళ్ల హత్యలు!
మంత్రగాళ్లని, క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ జరుగుతున్న హత్యల సంఖ్య పెరుగుతోందని మోదీ సర్కారు రాజ్యసభకు తెలిపింది. 2012 నుంచి 2014 వరకూ జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 127 హత్యలు జరిగాయని హోం శాఖ సహాయమంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి జాతీయ క్రైమ్ రికార్డులను (ఎన్సీఆర్బీ) ఉటంకిస్తూ, సభ్యులడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం, మంత్రగాళ్లన్న నెపంతో జరుగుతున్న హత్యల్లో 30 శాతం జార్ఖండ్ లోనే జరుగుతున్నాయి. ఈ మూడేళ్ల వ్యవధిలో వరుసగా 26, 54, 47 హత్యలు జరిగాయి. ఆపై షెడ్యూల్డ్ జాతుల ప్రజలు అధికంగా ఉన్న ఒడిశా నిలువగా, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు నిలిచాయి. ఇక్కడి ప్రజల్లో మంత్రాలపై ఉన్న నమ్మకాలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు హరిభాయ్ వివరించారు.