: మోదీ, ములాయంకు భంగపాటే... యూపీని గెలిచేది మాయావతి: ఏబీపీ న్యూస్ సర్వే


యూపీలో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఘన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఏబీపీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో వెల్లడైంది. మొత్తం 403 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్రంలో బీఎస్పీ 185 స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. బీఎస్పీకి 31 శాతం ఓట్లు రానున్నాయని, సమాజ్ వాదీ పార్టీకి 30 శాతం, బీజేపీకి 18 శాతం ఓట్లు వస్తాయని తమ సర్వేలో వెల్లడైనట్టు పేర్కొంది. ఇదే సమయంలో యూపీలో ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని అత్యుత్తమ నేతగా భావిస్తున్నారని, ఆపై మాయావతి, అఖిలేష్ లు నిలిచారని తెలిపింది. నిరుద్యోగం, అవినీతి, పేదరికం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు ఎన్నికలను శాసించనున్నాయని వెల్లడించింది. కాగా, 2012లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ 80 స్థానాలకు పరిమితంకాగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ 228 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News