: అవిశ్వాసం ‘లెక్క’ తప్పింది!... 56 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేస్తే, 57 మంది వేసినట్లు ప్రకటన


ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా టీడీపీ ప్రభుత్వంతో పాటు స్పీకర్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. తీర్మానాన్ని నెగ్గించుకునేంత బలం లేకపోయినా, ఆ తీర్మానాలను ప్రవేశపెట్టిన వైసీపీ... రెండు తీర్మానాల్లోను ఓటమి చవిచూసింది. ఓటింగ్ లో ఓడినా, అసెంబ్లీలో వాడీవేడీ చర్చకు ఈ తీర్మానాలు కారణమయ్యాయి. ఇక అవిశ్వాస తీర్మానాల్లాంటి కీలక సందర్భాల్లో జాగ్రత్తగా మసలుకునే అసెంబ్లీ సెక్రటేరియట్ మొన్న తప్పులో కాలేసింది. అవిశ్వాసానికి మద్దతుగా పడిన ఓట్ల లెక్కింపులో సిబ్బంది తడబడ్డారు. కోడెలపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేయగా, వ్యతిరేకంగా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ఓట్లేశారు. టీడీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉండటంతో వైసీపీ అవిశ్వాసం వీగిపోయింది. ఓట్ల లెక్కింపులో టీడీపీ సభ్యులను సరిగ్గానే లెక్కపెట్టిన సిబ్బంది... వైసీపీ ఎమ్మెల్యేల లెక్కింపులో మాత్రం పొరపాటు పడ్డారట. అసెంబ్లీలో ‘జంపింగ్’ ఎమ్మెల్యేలను తీసేస్తే వైసీపీకి నికరంగా 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓటింగ్ లో పాల్గొన్నది మాత్రం 56 మందే. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్, గౌతం రెడ్డి... ఉదయం సభకు వచ్చినా, ఓటింగ్ సమయంలో సభలో లేరు. దీంతో ఓటింగ్ లో పాల్గొన్నది 56 మందే. అయితే అవిశ్వాసానికి మద్దతుగా 57 ఓట్లు పోలైనట్లు అసెంబ్లీ సిబ్బంది లెక్కించారు. సభ వాయిదా పడ్డ తర్వాత బయటకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు తమ అంతర్గత చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News